తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సాయంత్రం చెన్నై ఆసుపత్రి సిబ్బంది తెలిపింది… కొద్ది సేపటి క్రితం ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఆసుపత్రికి చేరుకున్నారు…
- Advertisement -
అక్కడ చరణ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు… ఇంకా ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు… కాసేపట్లో ఎస్పీ కుటుంబం మీడియా ముందుకు రానుంది…
ఎస్పీని చూసేందుకు కోలీవుడ్ ప్రముఖులు ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుంటున్నారు.. దీంతో ఆసుపత్రి వద్దకు అదనపు పోలీసు వర్గాలు చేరుకున్నాయి…