కర్నూల్ జిల్లా రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. జిల్లాలో రాజకీయ ఉద్దండులు ఎందరో ఉన్నారు… అందులో ఒకరు భూమా ఫ్యామిలీ…. తల్లిదండ్రులు వారసత్వాన్నితీసుకుని రాజకీయఅరంగేట్రం చేసింది అఖిల ప్రియ… తల్లి మరణంతో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత తండ్రితో కలిసి టీడీపీ తీర్థం తీసుకున్నారు..
దీంతో ఆమెకు టీడీపీ తరపున మంత్రి పదవి వరించింది… ఇక 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డలో మరో సారి పోటీ చేసిన అఖిల ప్రియ ఓటమి చెందింది… దీంతో ఆమె తిరిగి వైసీపీలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆమె స్పందించింది తాను వైసీపీ పార్టీలో చేరుతానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది…
ఆతర్వాత ఆమె భర్త పై కేసులు నమోదు కావడంతో వాటిన ఎదుర్కునేందుకు తాను ఎంతకైనా రెడీ అని ప్రభుత్వాన్ని హెచ్చరించింది… అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె అనూహ్యంగా సైలెంట్ అయ్యారు.. దాదాపు రెండు నెలలుగా ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు లేవు… దీంతో అందరు చర్చించుకుంటున్నారు… అఖిల ప్రియ ఎందుకు యాక్టివ్ గా లేరని చర్చించుకుంటన్నారు… ఆమె విషయంలో టీడీపీ అధిష్టానం పెద్ద పట్టించుకోకుందనే వార్తలు వస్తున్నాయి..