చాలా మంది రేషన్ కార్డ్ లేక ఇబ్బంది పడుతున్నారు , అయితే ఏపీలో రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే మీరు అర్హులు అయితే పది రోజుల్లో రేషన్ కార్డ్ అందుతుంది అని తెలిపారు సీఎం జగన్, గ్రామ సచివాలయాల్లో వాలంటీర్ వ్యవస్ధ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు, ఇలా చాలా మంది రేషన్ కార్డు పొందారు, ఏకంగా ఒకే రోజు రేషన్ కార్డ్ మంజూరు అయినవి కూడా ఉన్నాయి.
అయితే మరో కీలక విషయం చెబుతున్నారు అధికారులు…కొందరు గతంలో రేషన్ తీసుకున్న వారు, రేషన్ కార్డ్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు, వీరికి ఓ గుడ్ న్యూస్ చెబుతున్నారు..పాత రేషన్ కార్డులు కలిగి ఉండి, వాటి స్థానంలో అర్హత ఉండి బియ్యం కార్డులు తీసుకోనివారు గ్రామ/వార్డు సచివాలయాల్లో సంప్రదించాలని .వారికి మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇస్తే, అందులో డీటెయిల్స్ చూసి మీకు కొత్త కార్డ్ ఇవ్వడం జరుగుతుంది.
ఇది ఏపీలో అన్నీ సచివాలయాల్లో ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు అధికారులు, అయితే రేషన్ కార్డ్ నెంబర్ ఉండి, కార్డ్ లేని వారు మాత్రమే ఇలా పొందాలి..కార్డుదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటే దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డు/రైస్ కార్డు నెంబర్ చెప్పి కార్డు పొందాలని తెలిపారు.