హార్లే డేవిడ్సన్ కంపెనీ భారత్ నుంచి ఎందుకు వెళ్లిపోతోంది?

-

అమెరికా లగ్జరీ బైక్స్ దిగ్గజం హార్లే డేవిడ్సన్ మన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బైక్లు తయారు చేస్తుంది, కోట్ల రూపాయల బైక్స్ కూడా తయారు చేస్తుంది, అనేక సినిమాల్లో మనం ఈ బైక్స్ చూస్తు ఉంటాం ,ధనవంతులకు క్రేజీ బైక్ ఇది, అయితే మన భారత్ లో కూడా దీనికి షోరూమ్ లు తయారీ యూనిట్లు ఉన్నాయి, ఇప్పటి వరకూ భారత్ లో అమ్మకాలు చేసింది ఈ కంపెనీ.

- Advertisement -

తాజాగా హార్లే డేవిడ్సన్.. భారత్కు గుడ్బై చెప్పింది. భారత్లో అమ్మకాలు, మాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలను ఆపేసింది…2009లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన హార్లే కంపెనీ ఇప్పటి వరకూ భారత్ లో అమ్మకాలు జరిపింది.

తాజాగా అమ్మకాలు భారీగా తగ్గాయి, అంతేకాదు 2020 రీస్ట్రక్చరింగ్ యాక్టివిటీస్ లో భాగంగా సిబ్బందిని తగ్గించుకోవటం, ఇతర దేశాల్లో ఉన్న వ్యాపారాలను కుదించుకోవటం వంటి నిర్ణయాలను కంపెనీ అమలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి హరియాణాలోని బావల్లో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది.
ఇక్కడ కూడా ఆర్డర్ ఉన్నవి షోరూమ్ లో ఇప్పటి వరకూ ఆర్డర్ వచ్చిన వాటిని మాత్రం డెలివరీ చేయనున్నారట, అయితే ప్రిమీయం బైక్ ల అమ్మకాల విషయంలో అనుకున్నంత సేల్స్ మాత్రం లేవు. ఇక హరియాణాలోని బావల్లో సుమారు 100 మంది ఉద్యోగులు ఉన్నారు అని తెలుస్తోంది
గురుగ్రామ్లో ఉన్న విక్రయాల కార్యాలయం కూడా క్లోజ్ అవ్వనుంది..ప్రస్తుత డీలర్ల నెట్వర్క్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...