దేశంలో టీవీల ధరలు చిన్నవి పెద్దవి అని కాదు అన్నీ కూడా పెరగనున్నాయి, దీనికి ప్రధాన కారణం, ఎల్ ఈడీ టీవీల తయారీ కోసం వినియోగించే ఓపెన్ సెల్ దిగుమతులపై అక్టోబర్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం 5 శాతం సుంకాన్ని అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇది జరిగితే ఇక టీవీల ధరలు మళ్లీ పెరుగుతాయి, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఓపెన్ సెల్ పైన గతంలో ప్రకటించినట్లుగా 5 శాతం కస్టమ్స్ సుంకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా చేయకపోత విడిభాగాలు బయట దేశాల నుంచి తెచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారు.
అందుకే టీవీల ధరలు పెరగనున్నాయి, మరి ఐదు శాతం పన్ను విధిస్తే కచ్చితంగా టీవీల ధరలు పెరుగుతాయి అని అంటున్నారు, అయితే ప్రస్తుత రేటు కంటే 4 శాతం పెరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు.. సుమారు చిన్న టీవి పదివేల నుంచి స్టార్ట్ అయ్యేది 600 పెరిగే అవకాశం ఉంది..32 ఇంచుల నుండి 42 ఇంచుల టీవీల ధరలు రూ.600 నుంచి రూ.1500 పెరిగే అవకాశం ఉంది, ఇక మరింత సైజ్ పెరిగితే 2500 వరకూ పెరగనున్నాయి.