కోవిడ్ 19 నుంచి కోలుకుని నెగిటివ్ నిర్దారణ కాగానే తమ ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదనే అతి విశ్వాసం వద్దని వైద్యులు సూచిస్తున్నారు.,.. అదే సమయంలో మరింత భయపడాల్సిన అవసరం లేదని కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు… ఇప్పుడు ఆ జాగ్రత్తలు ఏంటో తీసుకుందాం..
- Advertisement -
నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా దాదాపు మూడు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి… క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిదని వైద్యులు చెబుతున్నారు… ఈ క్రమంలో అంతకు ముందు నుంచి ఉన్న ఇతరత్రా వ్యాధులు ముదిరిపోకుండా చూసుకోవడం అత్యవసరమన్నారు…
కరోనా నుంచి కోలుకున్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గుండె పోటు మొదడు కిడ్నీ కీలక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తే ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు…