తమిళనాడులో అధికార అన్నాడీఎంకే తరపున మళ్లీ పళనిస్వామికే సీఎం అభ్యర్థిగా ఎన్నుకునే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి… పళనిస్వామి నేతృత్వంలోనే తమ పార్టీ 2021 అసెంబ్లీ ఎన్నికలకు వెళుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి…
నిన్న జరిగిన పార్టీకార్యవర్గ సమావేశంలో సీఎం అభ్యర్థిత్వం విషయమై దాదాపు 5 గంటల పాటు చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి… ఈ సందర్భంగా సీఎం పళనిస్వామి డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఇద్దరూ సీఎం అభ్యర్థిత్వం కోసం పట్టుబడినట్లు వార్తలు వస్తున్నాయి..
ఈ సంధర్భంగా కార్యవర్గం రెండు గ్రూపులుగా విడిపోయి పోటా పోటీ నినాదాలు కూడా చేస్తున్నారు.. అయితే పార్టీ కార్యవర్గ సమావేశంలో గొడవ జరిగినప్పటికీ సీఎం అభ్యర్థిత్వం మాత్రం పళనిస్వామికే దక్కబోతున్నదని అన్నాడీఎంకే లోని విశ్వసనీయ వర్గాల సమాచారం…