అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగచైతన్య సమంతల కాంబినేషన్ లో తెరకెక్కి మరో తాజా చిత్రం మజిలీ. ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. సినిమా విడుదల అయిన మొదటిరోజునుంచి మంచిటాక్ వినిపోస్తోంది.
ఇటీవలే విడుదల అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయలకు థియేట్రికల్ హక్కులను అమ్మగా ఇప్పటివరకు 31 కోట్ల రూపాయల షేర్ వసుళ్లు చేసింది. దీంతో చైతు కెరియర్ లో మజిలీ సినిమా బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులకు గాను 25 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల రూపాయలు షేర్ కలెక్షను సాధించుకుంది. మజిలీ ప్రపంచ వ్యప్తంగా 10 రోజుల కలెక్షన్లు ఈ క్రింది విధంగా చూడవచ్చు.
నైజామ్ 10.60 కోట్లు
ఈస్ట్ 1.51.కోట్లు
వెస్ట్ 1.13. కోట్లు
నెల్లూరు 0.73 కోట్లు
ఉత్తరాంధ్ర 3.71 కోట్లు
గుంటూరు 1.92 కోట్లు
సీడెడ్ 3.74 కోట్లు
కృష్ణా 1.65 కోట్లు
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 24.99 కోట్లు
కర్నాటక 2.72 కోట్లు
రెస్ట్ ఆప్ ఇండియా 1.12 కోట్లు
అమెరికా 2.24 కోట్లను సాధించి చైతు కెరియర్ లో బిగ్గస్ట్ మూవీగా మజిలీ నిలింది.