నిజమే ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది, అందుకే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు, అందుకే ఏ మెసేజ్ వచ్చినా ఏ మెయిల్ లింక్ వచ్చినా తెలియనివి స్పామ్ వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి, తాజాగా ఖాతాదార్లను అప్రమత్తం చేసిన ఎస్బీఐ… మరి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులను అప్రమత్తం చేసింది. లాటరీ గెలుచుకున్నారంటూ వాట్సాప్ కాల్స్ చేస్తారని, మోసపూరితమైన సందేశాలు పంపుతారని తెలిపింది. అంతేకాదు మిమ్మల్ని మోసం చేయడానికి ఏకంగా
ఎస్బీఐ నెంబర్ ను సంప్రదించాలంటూ నమ్మబలుకుతారని, ఇలాంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వాటికి మెయిల్ రిప్లై — మెసేజ్ రిప్లై లింక్ ఓపెన్ చేయడం వంటివి చేస్తే ఇబ్బంది ఉంటుంది, ఇవన్నీ లక్కీ లాటరీ గిఫ్టులు అంటూ మిమ్మల్ని మాయ చేయడానికి చేస్తున్నారు అని తెలిపింది బ్యాంకు. సో ఇవి మాత్రం మర్చిపోకండి.