ఇండియాలోకి మరో చైనా వైరస్ – జాగ్రత్త లక్షణాలు ఇవే

-

ఇప్పటికే మనం ఈ కరోనాతో భయపడిపోతున్నాం, కాని మళ్లీ చైనా నుంచి కొత్త వైరస్ లు
పుట్టుకువస్తున్నాయి అనే వార్తలు వినిపించడంతో అందరూ భయపడిపోతున్నారు, ఇదేం పరిస్దితి అని టెన్షన్ వస్తోంది ప్రతీ ఒక్కరికి.

- Advertisement -

అయితే తాజాగా ఓ కీలక విషయం బయటపడింది.. చైనాలో మొదటగా కనుగొన్న క్యాట్ క్యూ వైరస్ ఆనవాళ్లు భారత్ లోనూ ఉన్నట్లు ఐసీఎంఆర్ గుర్తించింది. ఇది జ్వరంలా వస్తుంది, అంతేకాదు మెదడువాపులా కనిపిస్తుంది లక్షణం, అయితే ఇది భారత్ లో సంక్రమించే ప్రమాదం ఉంది అంటున్నారు వైద్యులు.

క్యాట్ క్యూ వైరస్ అర్బోవైరస్ గ్రూప్కు చెందినది. ఇది మనుషులతో పాటు జంతువులు మొక్కలపైనా ప్రభావం చూపుతుంది. దీనిని చైనాలో దోమలు పందుల్లో గుర్తించారు, వియత్నాంలో కూడా లక్షణాలు కనిపించాయి. దోమల ద్వారా ఇది వ్యాపించే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.

భారత్ లో పందులు దోమల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజల నుంచి శాంపిల్స్ సేకరించి శాస్త్రవేత్తలు పరీక్షలు చేశారు. 883 మంది సీరం శాంపిల్స్ను పుణెలోని NIV లో పరీక్షించగా.. ఇద్దరిలో క్యాట్ క్యూ వైరస్ యాంటీ బాడీలు ఉన్నట్లు బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

లవంగాలతో ఇన్ని లాభాలా..

లవంగాలు(Cloves).. భారతదేశ వంటకాల్లో తరచుగా వాడే దినుసుల్లో ఒకటి. వీటి వల్ల...

పాకిస్థాన్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి హోదాలో పాకిస్థాన్‌లో పర్యటించడానికి సిద్ధమయ్యారు కేంద్ర విదేశాంగ శాఖ...