పుష్పలో ఫారెస్ట్ ఆఫీసర్ గా ఆ స్టార్ హీరో పేరు పరిశీలన

-

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం సినిమాతో మంచి హిట్ పొందారు, అయితే ఇప్పుడు మళ్లీ మెగా హీరోతో ఆయన సినిమా చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమా చేస్తున్నారు సుకుమార్. ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో మాస్ గా కనిపించనున్నాడు బన్నీ.

- Advertisement -

ఈసినిమాలో పుష్పక్ నారాయణ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు అల్లు అర్జున్.
తెలుగు- తమిళ- కన్నడ- మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది, పాన్ ఇండియా సినిమాగా ఇది వస్తోంది, ఈ సినిమాలో తెలుగు సీనియర్ నటులు అలాగే తమిళ- కన్నడ సీనియర్ నటులు కూడా నటించనున్నారు అని తెలుస్తోంది.

తమిళ్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నాడు. ఇక ఈ పాత్రకోసం తాజాగా మరో హీరోని ఫైనల్ చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి…తాజాగా స్టార్ హీరో మాధవన్ పేరు వినిపిస్తుంది. విజయ్ సేతుపతి ప్లేస్ లో మాధవన్ ను ఎంపిక చేశారట . అయితే ఇందులో ఫారెస్ట్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో మాధవన్ నటించనున్నారట..నవంబర్ 20 నుంచి సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు అని వార్తలు వస్తున్నాయి, మరి దీనిపై చిత్ర యూనిట్ ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...