నిజమే మనకు ప్రపంచంలో అనేక సంప్రదాయాలు పద్దతులు ఉంటాయి, అంతేకాదు ఆహరం విషయంలో కూడా చాలా డైట్లు ఉంటాయి, అయితే చాలా మందికి తెలిసింది ఏమిటి అంటే జపాన్ వారు ఎక్కువగా కష్టపడతారు, పని చేయడంలో వారిని మించిన వారు ఉండరు.. రోజుకి 12 గంటలు కూడా కొంతమంది కష్టపడతారు.
అయితే వారు ఆహరం తీసుకోవడంలో ఓ పద్దతి పాటిస్తారు జపనీయులు… చిన్న గిన్నెల్లో ఆహారం తింటారు. ఎందుకంటే… చిన్న ప్లేట్లు, గిన్నెల్లో తక్కువ ఆహారం పడుతుంది. కానీ అవి నిండుగా కనిపిస్తాయి. అందువల్ల అలాంటి వాటిలో తింటే మంచిది అని వారి భావన. అంతేకాదు దీని వల్ల బరువు పెరగరు, అనారోగ్యసమస్యలు ఉండవు.
దీని వల్ల ఆ దేశంలో భారీకాయం కలిగిన వారు తక్కువ మంది ఉంటారు, అంతే కాదు ఫ్యాటీ ఫుడ్ తీసుకోరు, ఈజీగా నడవటానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు ..కారు బైక్ ఉన్నా నడకకి ఇంపార్టెన్స్ ఇస్తారు., అందుకే జపాన్ లో వారు చాలా మంది తిండి విషయంలో ఆహారాలకి ఎక్కువ ఖర్చు చేయరట.