మన దేశంలో పుష్కరాల గురించి చాలా మందికి తెలుసు.. ప్రతీ 12 సంవత్సరాలకు వచ్చేది పుష్కరం అంటారు, ఇలా ఇప్పుడు మనకు పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు శార్వరీ నామ సంవత్సరంలో వస్తున్నాయి.. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 దాకా ఇవి జరగనున్నాయి.
అయితే వీటిని ఎలా చెబుతారు అంటే ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటపుడు ప్రతి నదికి పుష్కరాలు జరుపుతారు. దేశంలో పుష్కరాలు జరిపే 12 నదులలో తుంగభద్ర నది ఒకటి. నవగ్రహాల్లో ఒకటైన గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటుంది. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు జరుపుతారు.
ఇలా ఒక్కోనదికి ఒక్కో విశిష్టతగా చెబుతారు, మనకు ఈ తుంగభద్ర నది పుష్కరాలు 2008 లో జరిగాయి. ఇప్పుడు ఈ ఏడాది జరుగనున్నాయి..ఈ పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ముక్కోటి దేవతలు ఆ నదులలో కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే ఈ సమయంలో ఆనదిలో స్నానం ఎవరు చేసినా పూజ చేసినా వారికి ఆ భగవంతుడు పాపాలు పొగొడతాడు అని అంటారు, అందుకే ఎంత దూరం అయినా ఆ పుష్కర కాలంలో నదికి వచ్చి స్నానం ఆచరిస్తారు.