సీతాఫలాలు మనకు సీజన్ వచ్చింది అంటే బుట్టల్లో పెట్టి అమ్ముతారు, ఇక వినాయకచవితి వచ్చింది అంటే ఈ సీతాఫలాలు వచ్చేస్తాయి, ఇక మార్కెట్లో ఇప్పుడు సీతాఫలాలు వచ్చేశాయి, మరి ఇవి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, తీయగా ఎంతో రుచికరమైన మధురమైన పండు ఇది,
ఎన్నో పోషకాలు కలిగి ఉంది, మరి అవి తెలుసుకుందాం.
ఈ పండ్లు తింటే శరీరంలో ఉన్న చెడు అంతా పోతుంది, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎంతో మేలు చేసే విటమిన్ C ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం వంటివి మన గుండెను కాపాడతాయి. బీపీ సమస్య ఉన్నవారు వీటిని తీసుకోవచ్చు, ఇక విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంది, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, కంటి చూపు సమస్యలు ఉన్నవారు తిన్నా మంచిది.
మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే… జీర్ణక్రియ బాగా అవుతుంది. కాపర్… మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. డయేరియాకు చెక్ పెట్టే గుణం సీతాఫలానికి ఉంది.రుమాటిజం, కీళ్లనొప్పులకు చెక్ పెడుతుంది. కండరాలకు బలం నీరసం అనేది రాదు, ఇక చాలా మందికి రక్తహీనత ఉంటుంది వారు రోజుకి ఒకటి తీసుకున్నా మంచిదే, ఇక బరువు పెరగాలి అని అనుకుంటే ఇవి తినాలి ..ఇందులో
కేలరీలు ఎక్కువ. గర్భిణీలు కూడా తప్పక తినదగ్గ పండు సీతాఫలం. పిల్లలు పుట్టే సమయంలో నొప్పుల్ని నివారించే గుణం ఈ పండుకి ఉంది. షుగర్ వ్యాధి ఉన్న వారు ఏదో పది రోజులకి ఓసారి తీసుకుంటే పర్వాలేదు రోజు మాత్రం వద్దు అంటున్నారు నిపుణులు.