పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుని డెబిట్ క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారా ఇక నో డిస్కౌంట్

పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకుని డెబిట్ క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారా ఇక నో డిస్కౌంట్

0
84

ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా ఆన్ లైన్ పేమెంట్లు డిజిటల్ వాలెట్ పేమెంట్లు చేస్తున్నారు అందరూ, అయితే గతంలో ఇలాంటి పేమెంట్లు చేయడానికి ఆసక్తి చూపించాలి అని పలు డిస్కౌంట్లు ఇచ్చారు వ్యాపారులు కంపెనీలు, అయితే చాలా మంది పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునే సమయంలో ఆన్ లైన్ పేమెంట్లు డెబిట్ క్రికెడిట్ కార్డులు వాడేవారు.

అయితే వీరికి డిస్కౌంట్ వన్ పర్సెంట్ వచ్చేది, ఇప్పుడు అక్టోబర్ ఒకటి నుంచి ఈ డిస్కౌంట్ అనేది ఇక రాదు.. బంకుల్లో ఇకపై మీ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే ఎలాంటి డిస్కౌంట్ లభించదు.. అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారు.

డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించేందుకు ఆయిల్ కంపెనీలు గతంలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈ వ్యాలెట్ పేమెంట్స్పై డిస్కౌంట్స్ ఇచ్చేవి…సో ఇక వాటిని ఇవ్వడం లేదు, అందరూ ఇవే బాగా ఉపయోగిస్తున్నారు, ఇకపై డిస్కౌంట్లు ఉండవు అని తెలిపారు.