చరిత్రలో గాంధారి గురించి చాలా మంది ఈ పేరు వినే ఉంటారు, అయితే ఆమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం… మహాభారత ఇతిహాసములో హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుడి భార్య, కౌరవులకు తల్లి.
ఇక ఆమె పేరు వెనుక విషయం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఆప్ఘనిస్తానులో ఉన్న కాంధహార్
పాతపేరు గాంధార అలా గాంధారి అనే పేరు వచ్చింది అంటారు.. గాంధారి తండ్రి పేరు సుబలుడు, తమ్ముడు శకుని.
ధృతరాష్ట్రుడుతో వివాహ సంబంధం వస్తుంది … అప్పుడు ఆమె కూడా తన తండ్రి మాటను గౌరవించి వివాహానికి సిద్దం అంటుంది, అంతేకాదు తన భర్తకు కళ్లు లేవు అని తెలిసి .. తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకొంది. దుర్యోధనుడితో మొదలు ఆమెకి మొత్తం 100 మంది సంతానం, అలాగే దుస్సల అనే కుమార్తె ఉన్నారు. ఈ మహాభారత యుద్ధం ముగిసిన 15 సంవత్సరాల తరువాత గాంధారి తన భర్త ధృతరాష్ట్రుడు, బావమరిది విదుర, మరదలు కుంతిలతో కలిసి తపస్సు కోసం హస్తినాపూరం నుండి బయలుదేరింది. హిమాలయాలలో ధృతరాష్ట్ర, విదుర, కుంతిలతో పాటు అటవీ అగ్నిప్రమాదంలో గాంధారి కూడా మరణించి మోక్షాన్ని పొందింది అని చరిత్ర చెబుతోంది.