ఈ కరోనా సమయంలో పూర్తిగా ఆరు నెలలు ఏ వ్యాపారాలు లేవు చెల్లింపులు చేయలేక చాలా మంది ఇబ్బందులు పడ్డారు, అయితే కోవిడ్ కారణంగా వ్యాపారాలు లేక ఉద్యోగాలు లేక చెల్లింపులు చేయలేక కోట్లాది మంది ఇబ్బందులు పడ్డారు, ఈ సమయంలో మారటోరియాన్ని ప్రకటించింది కేంద్రం.
అయితే ఈ సమయంలో చాలా మంది ఈ మారటోరియం ఉపయోగించుకున్నారు, ఇంకొందరు మాత్రం ఈ మారటోరియం ఉపయోగించకుండా నిబద్దతగా వాయిదాలు చెల్లించారు, అయితే మారటోరియం ఉపయోగించుకున్నవారికి వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ ఇక పడదు, అది కేంద్రం చెల్లిస్తుంది.
రూ.2 కోట్లలోపు రుణాలు తీసుకుని, క్రమం తప్పకుండా వాయిదా చెల్లించిన వ్యక్తిగత వినియోగదారులకు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా ప్రయోజనం కలిగించే విధంగా క్యాష్ బ్యాక్ వంటి ప్రత్యామ్నాయాలపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందట, అంటే వారికి వడ్డీలో లేదా అసలులో కాస్త ప్రయోజనం కలిగించనున్నారు అని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకూ భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.