ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ చూస్తున్నారు, ఇక ఆన్ లైన్ షాపింగ్ చేసే వారు ఏ వస్తువులు తగ్గుతాయి అని ఎదురుచూస్తున్నారు, అయితే దసరా స్పెషల్ తో దేశ వ్యాప్తంగా మార్కెట్ పెరుగుతుంది అని భావించిన కంపెనీలు.. ఆఫర్లు కూడా ఇవ్వడానిక సిద్దం అయ్యాయి.
సో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2020 అక్టోబర్ 16 నుంచి 21 వరకూ జరుగనుంది, మరి ఏ వస్తువులు తగ్గుతాయి అనేది చూద్దాం..15వేల కన్నా తక్కువ ధర ఉన్న స్మార్ట్ఫోన్లు, 15 వేల నుంచి తక్కువగా ఉన్నటీవీల ధరలు, అలాగే రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ లు రేట్ తగ్గుతున్నాయి ఈ సేల్ లో అంటున్నారు ఈ. కామర్స్ అనలిస్టులు.
ఈసారి ఫ్లిప్కార్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనేవారికి 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసేవారికి క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఇక టీవీలు హోం అప్లెయన్సెస్ పై 25 వరకూ ఆఫర్ ఉండవచ్చు, ఈ కోవిడ్ లో వ్యాపారం లేక డీలా ఉన్న కంపెనీలు ఈ సేల్ పైఆశలు పెట్టుకున్నాయి…ఫ్లిప్కార్ట్ ప్లస్ కస్టమర్లకు బిగ్ బిలియన్ డేస్ డీల్స్ ఒకరోజు ముందుగానే లభిస్తాయి. అక్టోబర్ 15 నుంచి 21 వరకు ఆ ఆఫర్ వారికి ఉంటుంది.