హోటల్స్ రెస్టారెంట్లలో ఇద్దరు ఆంటీల ఎంట్రీ లక్షలు దోచేస్తున్నారు జర జాగ్రత్త

-

రెస్టారెంట్లు హోటల్స్ శుభ్రంగా ఉండకపోతే చాలా మంది అక్కడకు కస్టమర్లు రారు, అంతేకాదు పైకి బాగానే ఉన్నా కిచెన్ లో మాత్రం దారుణంగా కొన్ని హోటల్స్ ఉంటాయి, ఇలాంటి సమయంలో కొందరు ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అనూహ్యంగా చెకింగ్ చేసి ఆ హూటల్స్ ని సీజ్ చేస్తారు, ఇలాంటి కేసులు ఎన్నో చూశాము.

- Advertisement -

అయితే కోయంబత్తూరులోని పులియంకులం ప్రాంతంలో రెస్టారెంట్స్ హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. పులియంకులం ప్రాంతంలో ఓ ఖరీదైన కారులో ఇద్దరు మహిళలు వారి వెంట నలుగురు వ్యక్తులు వెళ్లారు.
నేరుగా హోటల్ లోకి వెళ్లి చెకింగ్ చేశారు, వెంటనే నలుగురు హడావిడి చేసి మొత్తం చెక్ చేసి

మేడమ్స్ ఫుడ్ ఇన్ స్పెక్టర్లు అని చెప్పారు, దీంతో హోటల్ వారు కంగారు పడ్డారు.. కిచెన్ ఆహర పదార్దాలు బాగానే ఉన్నా ఇవన్నీ ఇలా ఉన్నాయి ఏమిటి శుభ్రత నాణ్యత లేదు మీ హోటల్ సీజ్ చేస్తున్నాం అన్నారు, ఇలా చేయకూడదు అంటే లక్ష ఇవ్వాలి అని ఒకరిని అన్నారు.. మరో హోటల్ వ్యక్తిని రెండు లక్షలు డిమాండ్ చేశారు. చివరకు భయపడి వారు నగదు ఇచ్చారు, తర్వాత కిరాణా దుకాణాలపై పడ్డారు, అక్కడ ఇలా అందిన కాడికి దోచుకున్నారు.

ఆంటీల దెబ్బకు హడలిపోయిన వ్యాపారులు కోయంబత్తూరు జిల్లా ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే వారు అధికారులతో మాట్లాడితే అలాంటి వారు లేరని ఇలా ఎవరైనా వస్తే నేరుగా పోలీసులకి ఫిర్యాదు చేయాలి అని చెప్పారు. జర జాగ్రత్త.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sai Pallavi | ఉత్తమ నటిగా సాయిపల్లవి..

తమిళ చిత్ర పరిశ్రమ చాలా ప్రత్యేకంగా భావించే చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్...

High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి....