ఈ కరనా దెబ్బకి చాలా ట్రైన్స్ తిరగడం లేదు.. కేవలం కొన్ని ట్రైన్లు మాత్రమే నడుపుతోంది రైల్వేశాఖ.. ముందు హస్తిన నుంచి 30 ట్రైన్లు నడిపిన రైల్వేశాఖ తర్వాత వంద తర్వాత మరో 100 సర్వీసులు నడుపుతోంది ..సుమారు ఇప్పుడు దేశంలో 400 సర్వీసులు నడుస్తున్నాయి.
అయితే పూర్తిస్ధాయిలో రైళ్లు ఎప్పుడు తిరుగుతాయి అనేది ఇంకా తెలియదు… ఇప్పుడు పండుగ సీజన్ వస్తోంది. దసరా, దీపావళి పండుగల కారణంగా ట్రైన్లో ప్రయాణించే వారి సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మరో 80 నుంచి 100 కొత్త ట్రైన్లు సర్వీసులు నడపనుంది రైల్వేశాఖ.
కొత్త ట్రైన్స్ అక్టోబర్ 20 నుంచి దీపావళి వరకు, తిరగనున్నాయి. ఇక సాధారణంగా ఏదైనా ఫెస్టివల్ సమయంలో కొత్త ట్రైన్లు సర్వీసులు నడిపితే వాటికి సాధారణ ధర కంటే కాస్త ఎక్కువగా టికెట్ ధర ఉంటుంది, అది 20 నుంచి 30 శాతం మేర ఎక్కువ ఉండచ్చు, అయితే ఇప్పుడు కూడా ఈ దసరా దీపావళి కొత్త రైళ్లకు చార్జీలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు, కేవలం స్పెషల్ ట్రైన్లకు మాత్రమే ఈ కొత్త చార్జీలు ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది… ఇక కొత్త ట్రైన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి అనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.