బ్రేకింగ్ — గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లకు పోటీగా మరో యాప్ స్టోర్.

-

మనకు స్మార్ట్ ఫోన్లో కనిపించే యాప్ స్టోర్స్ ఏమిటి అంటే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ఫోన్లలో యాపిల్ యాప్ స్టోర్ ఉంటాయి, అయితే మన దేశంలో మాత్రం ఈ రెండిటికి ప్రత్యామ్నాయంగా ఒకయాప్ తయారు చేస్తున్నారు అని తెలుస్తోంది.

- Advertisement -

ఇప్పటికే మనకు అందుబాటులో ఉన్న మొబైల్ సేవ యాప్ స్టోర్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు ముందు మన దేశంలో తయారు అయ్యే అన్నీ ఫోన్లలో ఈ యాప్ స్టోర్ రానుంది, అప్పుడు దేశంలో వాడకం కూడా బాగా పెరుగుతుంది.

అందుబాటులో ఉన్న మొబైల్ సేవ యాప్ స్టోర్ను అప్ గ్రేడ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త యాప్ స్టోర్ను సీ-డాక్ రూపొందిస్తుందని, సురక్షితమైన పేమెంట్ సేవలను అందించడానికి ఎన్పీసీఐ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.

ఇప్పటికే మనం వాడే యాప్స్ లో, గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో ఉంచే యాప్స్ నుంచి 30 శాతం చార్జ్ అవి వసూలు చేస్తాయి. ఇక మన దేశీయంగా తయారు అయ్యే యాప్ స్టోర్ ఉచితంగా ఉంటుంది అని తెలుస్తోంది, అంతేకాదు ఎలాంటి చార్జీలు ఉండకపోవడం వల్ల యాప్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది మార్కెట్లకి .భారతీయ సార్ట్అప్ కంపెనీలను కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలనుకుంటోంది. సో ఇది రావాలి అని చాలా మంది టెక్ నిపుణులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పరీక్ష విధానంలో మార్పులు.. ఎప్పటినుంచో చెప్పిన మంత్రి లోకేష్

విద్యాశాఖపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై...

జానీ మాస్టర్‌పై కేసు నమోదు.. లైగింకా వేధించాడంటూ ఫిర్యాదు..

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌(Jani Master)పై లైంగిక వేధింపుల కేసు...