కరోనా సమయంలో రైల్వే ప్రయాణికులు ప్రయాణం చేద్దాం అంటే పూర్తీ రైలు సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్నారు, అయితే కేంద్రం ఈ సమయంలో రిస్క్ తీసుకోవడం లేదు.. రైల్వేశాఖ కూడా కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే రైళ్లు నడుపుతోంది, అంతేకాదు హాల్ట్ లు కూడా తగ్గించేసింది.
తాజాగా పండుగ సమయం ఈ సమయంలో ప్రస్తుతం నడుస్తున్న రైళ్లతో పాటు.. మరో 39 రైళ్లను నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక రైళ్ల కేటగిరీలోనే వీటిని నడుపనున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక వీటికి రిజర్వేషన్ ఎప్పుడు అనేది ఇంకా తెలియచేయలేదు, డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. బహుశా మరో వారంలో వీటిపై క్లారిటీ రావచ్చు
.
లోకమాన్య తిలక్ హరిద్వార్
లోకమాన్య తిలక్ టు లక్నో
అజ్ని టు పూణె
న్యూఢిల్లీ టు కట్ర
నిజాముద్దీన్ టు పూణె
సికింద్రాబాద్ టు షాలిమార్
లింగంపల్లి టు కాకినాడ
హౌరా టు యశ్వంత్ పూర్
మరి ఆ రైళ్ల జాబితా ఇదే లిస్ట్ చూడండి.
Railway Board today gave approval to zones for 39 new trains. These services will be introduced as special services from an early convenient date: Ministry of Railways, Government of India pic.twitter.com/UloAYzxZBS
— ANI (@ANI) October 7, 2020