ఆ కాళరాత్రి ఎవరూ మర్చిపోలేరు.. తమిళనాడు కూడా సునామి తాకిడికి ఎంతో నష్టం చూసింది వందల మంది ప్రాణాలు కోల్పోయారు.. సముద్ర తీర ప్రాంతాలు విలయతాండవం చేశాయి.. అయితే మళ్లీ అలాంటి రోజు రాకూడదు అని అందరూ భయపడ్డారు..2004లో వచ్చిన సునామీ మళ్లీ రాకూడదు అని అందరూ కోరుకున్నారు.
తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లింది. ఉదయం సముద్ర మట్టం బాగానే ఉన్నా సాయంత్రం సమయానికి సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. రాత్రంతా అలానే ఉందట.. దీంతో అక్కడ జనం కూడా భయపడ్డారు.
ఎవరూ సముద్రం దగ్గరకు రావడం లేదు మళ్లీ సునామి వస్తుంది అనే భయం కూడా వారిలో కలుగుతోంది, అయితే 2004లోనూ సునామీ రావడానికి ముందు ఇలాగే సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లిందంట.. అమవాస్య, పౌర్ణమి రోజుల్లోనే ఇలా జరుగుతుంటుందని అంటున్నారు. ఏది ఏమైనా తమిళనాడులోని కన్యకుమారి తీరంలో రెండు రోజులుగా సముద్రమట్టంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని అక్కడ ప్రజలు భయపడుతున్నారు, అధికారులు మాత్రం ఎలాంటి భయం వద్దు అని చెబుతున్నారు.
హిందు మహా సముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం కలిసే ప్రాంతాన్ని త్రికడలి సంగమంగా పిలుస్తుంటారు.