బిర్యానీ కోసం 2 కిలోమీటర్ల క్యూ – ఈ బిర్యానీ టేస్ట్ అదుర్స్ – వీడియో చూడండి
బిర్యానీ కోసం రెండు కిలోమీటర్ల లైన్ ఏమిటి అని అనుకుంటున్నారా, నిజమే అనుమానం వస్తుంది, ఈ కరోనా సమయంలో క్యూ కట్టడం ఏమిటి అని అనుకోకండి, కరోనా గిరోనా మాకు భయం లేదు మేము ఆ టేస్టీ బిర్యానీ తినాల్సిందే అంటున్నారు జనం.
బెంగళూరు సిటీ సెంటర్ కు 25కిలోమీటర్ల దూరంలో హోస్కోటే ఆనంద్ బిర్యానీ అనే రెస్టారెంట్ ఉంది. హంగులు ఆర్బాటాలు ఏమీ ఉండవు. చూడటానికి సింపుల్ గా ఉంటుంది.కాని బిర్యానీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది, అందుకే ఇక్కడ బిర్యానీ కోసం బిర్యాని ప్రియులు బాగా వస్తారు.
ఉదయం ఆరుగంటల నుంచే కిలోమీటర్ల మేర క్యూ కడుతుంటారు. ఇక్కడ టోకెన్ ముందు ఇస్తారు తర్వాత బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు, ఓ పక్క వండుతూనే ఉంటారు, ఓపక్క పార్శిల్ జరుగుతూనే ఉంటుంది, రోజు వేల ప్యాకెట్లు పార్శిల్స్ అమ్ముతారు. ప్రస్తుతం ఆ వీడియోలే నెట్టింట్లో హడావిడి చేస్తున్నాయి. పోలేగాని మాస్క్ ఉన్నవారికి మాత్రమే బిర్యాని ఇస్తున్నారు.
మరి ఆ వీడియో చూడండి మీరు కూడా.
వీడియో లింక్
Queue for biryani at Hoskote, Bangalore. Send by @ijasonjoseph
Tell me what biryani this is and is it free? pic.twitter.com/XnUOZJJd2c— Kaveri ?? (@ikaveri) September 26, 2020
.