అయోధ్య రామమందిరానికి 613 కిలోల భారీ గంట .. దీని ప్రత్యేకత తప్పక తెలుసుకోవాలి

-

అయోధ్యలో రామమందిరం కోసం ఓ భారీ గంట తయారు చేశారు, తాజాగా అయోధ్యకు ఈ భారీ గంట చేరుకుంది, తమిళనాడులోని రామేశ్వరం నుండి ప్రారంభించిన రామ రథయాత్ర తో దీనిని అయోధ్యకు తీసుకువచ్చారు.

- Advertisement -

613 కేజీల భారీ గంట 4,555 కిలోమీటర్లు ప్రయాణం చేసి చివరకు అయోధ్యకు చేరుకుంది. 4.13 అడుగుల పొడవు, 3.9 అడుగుల వెడల్పుతో సీతా, రామ, లక్ష్మణ, హనుమంతుడు వినాయకుడి ప్రతిమలతో, జైశ్రీరామ్ అక్షరాలు రాసి ఉంది ఈ గంటపై, అంతేకాదు ఈ గంట మోగిస్తే దీని ప్రతిధ్వని 8 నుండి 10 కిలోమీటర్ల వరకు వస్తుంది.

మనం ఆలయంలో గంటను మోగిస్తే టంగ్, టంగ్ అంటూ శబ్దం వస్తుంది. కానీ ఈ గంట మోగిస్తే ఓంకారం ప్రతిధ్వనిస్తుంది. ఇక రాముడి ఆలయం పూర్తి అయిన తర్వాత ఈ గంటని గుడిలో అమర్చుతారు . ఇక ఈ గంటని చూసేందుకు అక్కడకు చాలా మంది స్ధానికులు వస్తున్నారు, ఇంత పెద్ద గంట ఎక్కడా లేదు అంటున్నారు, దీని కోసం భారీ క్రేనులు తెప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....