నిజమే ఒక్కోసారి చేపల కోసం వలవేస్తే ఆ వలలో చేపలతో పాటు పాములు కూడా వస్తాయి, తాజాగా ఇలాంటి ఘటనలు నదులు సముద్రాల్లో జరుగుతాయి, ఇవి కాటువేసి చనిపోయిన వారు ఉన్నారు, అయితే తాజాగా జరిగిన ఓ ఘటన అందర్ని షాక్ కి గురి చేసింది, అంతేకాదు మత్స్యకారులు షాక్ అయ్యారు.
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లి వద్ద కృష్ణానది పాయలో కొందరు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లారు. చేపల కోసం వల విసరగా, చేపలతో పాటు పెద్ద కొండచిలువ కూడా పడింది. 15 అడుగుల ఆ కొండచిలువను చూసి జాలర్లు హడలిపోయారు. ఇక ఈ విషయం అక్కడ అటవీ అధికారులకి తెలిపారు.
ఇలాంటిది ఇక్కడ ఎక్కడా చూడలేదు అని అన్నారు, ఇక వరదల సమయంలో ఇవి కొట్టుకుని నదిలోకి వస్తాయి ఇది కూడా అలా వచ్చిందే అంటున్నారు, ఇక ఇవి జంతువులని వదలవు, నీరుతాగడానికి వస్తే అమాంతం నదిలో లాక్కువెళ్లి చంపేస్తాయి.