బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అనే చెప్పాలి, ఈ వార్త చాలా వరకూ వ్యాపారులకి సాధారణ ప్రజలకు కూడా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు అందరూ, ఫండ్ ట్రాన్స్ఫర్కు సంబంధించి ఆర్టీజీఎస్ సిస్టమ్ రోజంతా అందుబాటులో ఉంటుందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ .
డిసెంబర్ నుంచి ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుందని… ఆర్టీజీఎస్ ద్వారా కనీసం రూ.2 లక్షలను పంపాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీజీసీ విధానం బ్యాంకింగ్ పనివేళల్లో మాత్రమే డబ్బులు పంపగలం. కాని ఇప్పుడు ఇలా 24 గంటలు నగదు ట్రాన్ ఫర్ చేయవచ్చు అని తెలిపింది ఆర్బీఐ.
ఇకపోతే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీ సమీక్షలో కీలక వడ్డ రేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారికి కొంత ఊరట కలిగించారు, ఇక వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు.