పరుగులు పెట్టిన బంగారం ధర మళ్లీ నేలచూపులు చూస్తోంది, ఒక్కసారిగా తగ్గుతోంది పసిడి, నేడు కూడా మార్కెట్లో బంగారం ధర తగ్గింది, అయితే బంగారం బాటలో వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. మరి ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర మరోసారి దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గుదలతో రూ.52,790కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.290 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,360కు చేరింది.
బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.600 తగ్గింది. దీంతో వెండి ధర రూ.62,000కు చేరింది. అయితే బంగారం వెండి ధరలు ఇలా తగ్గుదల చూపినా కాస్త అమ్మకాలు తగ్గుతున్నాయి, షేర్ మార్కెట్ పుంజుకోవడంతో ఇలా బంగారం ధర తగ్గుతోంది అంటున్నారు నిపుణులు.