మనం పెద్దలు చెప్పే మాట ఒకటి వింటూ ఉంటాం, జలుబు గొంతు నొప్పి ఉంటే కాస్త చికెన్ తిను లేదా చికెన్ సూప్ తాగు అని చెబుతారు, దీని వల్ల మంచి ఇమ్యునిటీ పవర్ వస్తుంది అంటారు, అయితే ఇది ఎంత వరకూ నిజం అంటే ? ఇది తీసుకుంటే మంచిదే అంటున్నారు నిపుణులు.
నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ సూప్ చేసుకుని తాగితే మంచిది. అందులో లెమన్ యాడ్ చేసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది. మరి సింపుల్ గా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం.
బోన్లెస్ చికెన్: 60 గ్రాములు
అల్లం–వెల్లుల్లి పేస్ట్: అర టీ స్పూన్
నిమ్మకాయ: నాలుగు చెక్కలు,
కొత్తిమీర: ఒక టేబుల్ స్పూన్
పసుపు: అర టీ స్పూన్, గ్రీన్ చిల్లీ పేస్ట్: అర టీ స్పూన్, కార్న్ఫ్లోర్: ఒక టీ స్పూన్
ఉప్పు: తగినంత, నీళ్లు: 200 మిల్లీ గ్రాములు
ముందుగా మీరు చికెన్ చిన్న చిన్న పీసులు తీసుకోవాలి, కట్ చేసుకోండి, వేడీ నీటి పాన్ లో అవి వేసి బాగా ఉడకనివ్వాలి
ఇందులోనే అల్లం–వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ పేస్ట్, నాలుగు చెక్కల నుంచి తీసిన నిమ్మరసం, తగినంత ఉప్పు వేసి మరికొద్ది సేపు ఉడకనివ్వాలి. సూప్ చిక్కదనం కోసం కార్న్ఫ్లోర్ కూడా కలపాలి. ఇలా ఐదు నిమిషాలు ఉంచి తీసుకుంటే
గొంతు నొప్పి సమస్య తగ్గుతుంది.