చాలా మంది తోడు కోసం చూసి డేటింగ్ యాప్స్ వాడుతున్నారు, అయితే నిండా మోసపోయిన తర్వాత పోలీసు స్టేషన్ ముందుకు వస్తున్నారు, ఇలాంటి కేసులు నిత్యం చాలా నమోదు అవుతున్నాయి.ఇద్దరు పశ్చిమ బెంగాల్ యువకులు ఓ డేటింగ్ యాప్ పెట్టారు, ఇందులో అమ్మాయిల ఫోటోలు ఫోన్ నెంబర్లు ఉంచుతున్నారు.
ఇలా ఎవరైనా లాగిన్ అయి ఆ డీటెయిల్స్ కావాలి అంటే, వారు ఎంటర్ అవుతారు, తాము అమ్మాయిలని సరఫరా చేస్తాము అని చెప్పి వారి నుంచి మెంబర్ షిప్ కింద కొంత నగదు అడుగుతారు, అంతేకాదు వారితో హోటల్ లో మాట్లాడాలి అంటే గోల్డ్ కార్డ్ తీసుకోవాలి అని చెబుతారు, ఇక రూమ్ కి అంటే డైమెండ్ కార్డ్ అంటారు, ఇక విల్లాకి అయితే ప్లాటినం కార్డ్ అంటారు.
ఇలా తీసుకున్న తర్వాత నగదు పంపిచిన గంటకే ఫోన్ స్వీఛ్చాఫ్ అవుతుంది, ఇక వారు నగదు పంపరు, ఆ యాప్ లో మీ లాగిన్ డీ టెయిల్స్ పనిచేయవు, సో ఇలా మోసం చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో వీరి బండారం బయటపడింది. వారి బ్యాంక్ అకౌంట్ ద్వారా పోలీసులు వారిని గుర్తించారు, వారు కలకత్తాకి చెందిన వారు అని తేలింది.