బంగారం ధర పరుగులు పెట్టింది, రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు మార్కెట్లో పెరుగుతోంది, నేడు పరుగులు పెట్టింది పుత్తడి.బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా పైకి కదిలింది. మరి బంగారం ధర ఈరోజు రేటు ఎలా ఉంది అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరుగుదలతో రూ.52,940కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.180 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,530కు
చేరింది, ఇక బంగారం వచ్చే రోజుల్లో తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు వ్యాపారులు.
బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.600 పెరిగింది. దీంతో వెండి ధర రూ.61,600కు చేరింది. అయితే ఈ మూడు రోజులుగా సుమారు 2800 తగ్గిన వెండి నేడు మార్కెట్లో పెరుగుదల నమోదు చేసింది, అయితే వచ్చే రోజుల్లో వెండి బంగారం తగ్గే సూచనలు ఉన్నాయి.. షేర్ల మార్కెట్ లాభాల్లో ఉంది సో కచ్చితంగా బంగారం మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు.