విమానమే రెస్టారెంట్ దీని ప్రత్యేకతలు తెలిస్తే వావ్ అనాల్సిందే

-

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్నీ రంగాలు ఇబ్బందులు పడ్డాయి, ఒకటే అని కాదు అన్నీ తీవ్ర నష్టాలు చూశాయి, అయితే రవాణాకి సంబంధించి రైళ్లు బస్సులు విమానాలు పూర్తిగా ఆరునెలలుగా నిలిచిపోయాయి, దీంతో ఎక్కడికి వెళ్లలేని స్దితి ముఖ్యంగా విదేశీ స్వదేశీ విమాన ప్రయాణాలు చాలా వరకూ నిలిచిపోయాయి దీంతో ఈ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

- Advertisement -

ఆయా సంస్థలు డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా టూరిజం సేవలందించేందుకు ఫ్లైట్స్ టూ నో వేర్ సర్వీసులను ప్రవేశపెట్టాయి. కానీ సింగపూర్ ఎయిర్లైన్స్ ఏకంగా తమ విమానాలను రెస్టారెంట్లుగా మార్చింది. నిజమే ఏదో రకంగా గట్టెక్కాలి అంటే ఇదో మార్గం అంటున్నారు అందరూ.

సర్వీసులు ఆగిపోవడం వల్ల సింగపూర్ ఎయిర్లైన్స్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. భారీగా వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి తమ సంస్థకు చెందిన రెండు A380 విమానాల్లో ఒకదాన్ని రెస్టారెంట్గా మార్చింది. ఇది అతి పెద్ద జెట్, ఇందులో ప్రయాణికులకు ఆహరం అందిస్తారు, సో ఇప్పుడు ఇదే రెస్టారెంట్ గా మారింది, ఈ విమానంలో భోజనం ఖరీదు చాలా ఎక్కువ. ఒక్క మీల్స్కు 642 సింగపూర్ డాలర్లు అంటే 470 అమెరికన్ డాలర్లు చెల్లించాలి.ఇక ఇందులో 900 మంది ఫుడ్ తినచ్చు, ముందు మాత్రం ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.కరోనా నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...