బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో నోయెల్ ఒకరు, అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో నోయెల్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది దానికి కారణం నోయెల్ చేసిన పని అంటున్నారు చాలా మంది,
అబద్ధాల కోరు అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు అందరూ, అయితే ఎందుకు ఇలాంటి విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి అనేది చూస్దే.
తల్లిదండ్రుల గురించి అబద్ధం చెప్పాడు అంటున్నారు నెటిజన్లు.ఈవారం మధ్యలో కంటెస్టెంట్లు రియల్ లైఫ్ కష్టాలు చెప్పుకుని కన్నీరు మున్నీరు అయిన విషయం తెలిసిందే. నోయెల్ తన గురించి చెప్పాడు. మా అమ్మ అందరి ఇళ్లల్లో పని చేసేదని.. నాన్న రకరకాల పనులు చేసేవాడని చెప్పాడు. ఇస్త్రీ, మేస్త్రీ పని చేస్తూ డబ్బులు సంపాదించేవాడు అని తెలిపాడు.
ఇది విని అందరూ షాక్ అయ్యారు పాపం నెయెల్ చాలా కష్టాలు పడ్డాడు అని అనుకున్నారు, ఈ సమయంలో చాలా మంది నోయెల్ గురించి వికీపీడియో సెర్చ్ చేశారు.నోయెల్ తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని ఉంది. దానిని పట్టుకుని నెటిజన్లు నోయెల్ మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు.
సెంటిమెంట్ తో మమ్మల్ని బకరా చేయాలి అని చూస్తున్నావా అని కామెంట్లు చేస్తున్నారు
వికీపీడియాలో ఓసారి అతడి తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అని, మరోసారి కూలీ అని మార్చేసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు. అయితే ఉద్యోగం రాకముందు డైలీ లేబర్ కావచ్చు అని అతని అభిమానులు వెనకేసుకు వస్తున్నారు.