అలర్ట్ – చర్మంపై కరోనా వైరస్ ఎంత సేపు ఉంటుంది- తప్పక తెలుసుకోండి

-

ఈ కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది, ఎప్పుడు టీకా వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, అయితే ఈ కరోనాకి చెక్ పెట్టాలి అంటే కచ్చితంగా టీకా రావాల్సిందే, అయితే మనం ఇప్పుడు ఏ వస్తువు ముట్టుకోవాలి అన్నా భయపడే స్దితి వచ్చింది, మరీ ముఖ్యంగా అక్కడ వైరస్ సజీవంగా ఉంటోంది అనే భయం కలుగుతోంది.

- Advertisement -

అందుకే ప్లాస్టిక్ స్టీల్ వస్తువులని కూడా తాకడం లేదు చాలా మంది బయట ప్రాంతాల్లో, లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద 9 రోజుల వరకూ వైరస్ బతకగలవని, వాటిలో కొన్ని బయట కనిష్ట ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ సజీవంగా ఉంటాయిని ఇటీవల తెలిపారు సైంటిస్టులు..తాజాగా మానవ శరీరంపై కరోనా వైరస్ 9 గంటల వరకు మనుగడ సాగించగలదని ఓ పరిశోధనలో వెల్లడయ్యింది.

ఇది కచ్చితంగా గుర్తు ఉంచుకోవాలి, మన శరీరంపై 9 గంటలు కచ్చితంగా బతికి ఉంటుందని జపాన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. సాధారణ ఫ్లూకి కారణమయ్యే వైరస్ మానవ చర్మంపై సుమారు 1.8 గంటలు జీవించి ఉంటుందని, దాంతో పోల్చితే ఇది ఐదు రెట్లు ఎక్కువ కాలం జీవిస్తుందని తేలింది, అందుకే ఆ చేయి తాకినా వేరే వ్యక్తికి వైరస్ సోకుతుంది,
ఏదిఏమైనా చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల ముప్పు తగ్గించుకోవచ్చు జాగ్రత్తలు పాటించండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...