ఒక వయసు వచ్చిన తర్వాత కండోమ్స్ గురించి ఆటోమెటిక్ గా పిల్లలకు తెలుస్తుంది, అయితే పిల్లలకు దీని గురించి పేరెంట్స్ కూడా చెప్పక్కర్లేదు.. ఫ్రెండ్స్ మీడియా పలు వార్తలు ఇవి చదివి యుక్త వయసులో తెలుసుకుంటారు, ఇక పెద్ద పెద్ద డవలప్ డు కంట్రీస్ లో కూడా ఇదే జరుగుతోంది, అయితే ఇప్పుడు ఓ వార్త కాస్త ఆలోచన కలిగిస్తోంది.
కండోమ్స్ వాడకం విషయంలో కొన్ని దేశాలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మహిళల్లో అబార్షన్లు నిరోధించడంతో పాటు శృంగారం వల్ల వచ్చే కొన్ని వ్యాధులను నిరోధించేందుకు కండోమ్ వాడకాన్ని చాలా దేశాలు ప్రొత్సహిస్తున్నాయి. అమెరికాలో వెర్మొంట్ రాష్ట్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కండోమ్లను ఇచ్చేలా కొత్త చట్టం రూపొందించింది.
కొందరికి ఇది షాకింగ్ అనిపించింది మరికొందరు మాత్రం ఇది మంచిదే అంటున్నారు, ఉచితంగా స్కూల్ లో స్టూడెంట్స్ కి ఇవి ఇస్తున్నారు, అమ్మాయిలు అనవసరంగా గర్భం దాల్చకుండా ఉండటంతో పాటు శృంగారం వల్ల వచ్చే కొన్ని వ్యాధులను నిరోధించేందుకు ఈ రకమైన చట్టాన్ని రూపొందించారు. ఇక స్కూల్లో ఓ బ్యాక్స్ పెట్టి అందులో వీటిని ఉంచుతారు.
పలు పబ్లిక్ ప్లేస్లలోనూ వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. సర్వేలో కేవలం 32 శాతం మంది స్కూల్ విద్యార్థులు మాత్రమే కండోమ్స్ వాడుతున్నట్టు తేలింది. అందుకే దీనిని అమలు చేస్తున్నారు.