పవిత్రమైన దేవీ నవరాత్రులు అక్టోబరు 17 నుంచి ప్రారంభం అయ్యాయి, ఎంతో నిష్టతో పూజలు చేస్తారు భక్తులు, అంతేకాదు ఈ కరోనా సమయంలో జాగ్రత్తలు తీసుకుని దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రులు జరుపుతున్నారు, . దేశవ్యాప్తంగా అమ్మవారిని 9 రోజుల పాటు 9 రూపాల్లో కొలుస్తారు.
ఈ నెల 25 వరకు ఈ శరన్నవరాత్రులు జరుగుతాయి.
మరి ఏరోజు ఏ అమ్మవారు అలంకరణ ఉంటుంది, అలాగే ఎలాంటి నైవేధ్యం పెట్టాలి అనేది కూడా తెలుసుకుందాం.
అక్టోబరు 17 శనివారం శైలిపుత్రి అలంకారం .. ఈ రోజు నైవేధ్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు
సాంబారు అన్నం, మినప వడలు, రవ్వకేసరి, పానకాన్ని నైవేద్యంగాపెడతారు
18 అక్టోబర్ – రెండో రోజు.. అమ్మవారు బాలా త్రిపుర సుందరి . నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.
19 అక్టోబర్ గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం పెడతారు
20 అక్టోబర్- అన్నపూర్ణదేవిగా అలంకరిస్తారు. గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా పెడతారు.
21 అక్టోబర్ – లలితా దేవి అలంకరణల. నైవేద్యంగా దద్ద్యోజనం సమర్పిస్తారు.
22 అక్టోబర్ – మహా లక్ష్మీ అమ్మవారి అలంకరణ . నైవేద్యంగా కేసరి సమర్పిస్తారు.
23 అక్టోబర్ – జగన్మాత సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది. నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు.
24 అక్టోబర్ – దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.
25 అక్టోబర్ – మహిషాసురమర్దిని అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు నైవేద్యంగా రవ్వతో చేసి చక్కెర పొంగలి సమర్పిస్తారు.
ఇలా అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు ఈ నవరాత్రుల కాలంలో.
.