దుబాయ్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓడించింది అయితే గెలిచే మ్యాచ్ ఇలా చేతులారా పోయింది అని రాజస్ధాన్ అభిమానులు ఫీల్ అవుతున్నారు, అయితే చివరి రెండు ఓవర్లు మ్యాచ్ ఫేట్ ని మారుస్తాయి కాని బౌలర్ మొత్తం మ్యాచ్ నే మార్చేశాడు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
డివిలియర్స్, కెప్టెన్ కొహ్లీ విధ్వంసం సృష్టించడంతో రాయల్స్ జట్టు పరాజయం పాలయింది…. రాజస్థాన్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ చెత్త బౌలింగ్ కూడా కారమని బీభత్సంగా ట్రోలింగ్ స్టార్ట్ అయింది..
ఆర్బీసీ విజయానికి ఉనద్కత్ సహకరించాడని ఆర్ఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
విజయానికి దగ్గరగా ఉన్న సమయంలో ఇలాంటి బౌలింగ్ ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.
జయదేవ్ ఉనద్కత్ 19వ ఓవర్ వేశాడు..బెంగళూరు 35 పరుగులు చేయాలి.అయితే డివిలియర్స్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు ఈ ఓవర్లో.ఆ ఒక్క ఓవర్లోనే 25 పరుగులు వచ్చాయి…చివరి ఓవర్లో 10 పరుగులు చేయాలి చివరకు డివిలియర్స్ భారీ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ విన్ అయ్యారు,దీంతో ఉనద్కత్ ను టీమ్ నుంచి ఎలిమినేట్ చేయాలి అని కోరుతున్నారు ఫ్యాన్స్ .