దేశంలో చాలా ప్రాంతాల్లో అనేక పండగలను ఆయా పర్యాలుగా జరుపుకుంటారు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుపుకుంటారు కానీ తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే బతుకమ్మ పండుగా మాత్రం ఈ ప్రాంతం ఆత్మను ప్రకటిస్తుంది…
దసరాకు తొమ్మిది రోజులనుంచి బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటారు.. ఈ పండుగ తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనదని అంటారు.. ఇప్పుడు ఈ పండగ యొక్క విశిష్టత తెలుసుకుందాం… బతుకమ్మ అంటే పూల పండగ ప్రకృతిపూలను అందంగా అలంకరించి పూజించే దేవత బతుకమ్మ అని అంటారు…
శ్రీ లక్ష్మీని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా అంటూ సాగే బతుకమ్మ పాట ప్రసిద్దమైనది… బతుకమ్మ స్వరూపం లక్ష్మీ పార్వతీ సరస్వతీ దేవీలు బతుకమ్మ స్వరూపంగా భావించి తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగను జరపుకుంటారు.. ధనం, ధాన్యం, సంతానం, సౌభాగ్యం, వైభవం, విద్యను ఇవ్వాలని గౌరమ్మను కోరుకుంటారు..
—