తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు హీటెక్కుతోంది… మరికొద్దిరోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలన్ని గెలుపుకోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి… ప్రధానంగా మూడు పార్టీలు గెలుపే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు…
అధికార పార్టీ ఎమ్మెల్యే ఆకస్మిక మరణంతో దుబ్బాకలో ఎన్నికలు అని వార్యం అయ్యారు… ఇటీవలే ఎన్నికల సంఘం నోటీఫికేషన్ విడుదల చేసింది… వచ్చేనెల 3న ఉప ఎన్నికల పోలీంగ్ జరుగనుంది… టీఆర్ ఎస్ అభ్యర్థిగా దివంగత రామలింగా రెడ్డి సతీమణి సోలిపేట సుజాత పోటీ చేస్తోంది..
ఇక కాంగ్రెస్ పార్టీ తరపున చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఇక బీజేపీ తరపున రఘునందన్ పోటీ చేస్తున్నాడు…. ప్రధానంగా ఈ పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు.. మరి దుబ్బాక ప్రజల తీర్పు ఎటు వైపో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే….