హైదరాబాద్ వాసులకు ఈ వర్షం చుక్కలు చూపిస్తోంది, నెలలో కురవాల్సిన వర్షం గంటలో కురిస్తే ఎలా ఉంటుంది అలా ఉంది పరిస్దితి, భారీగా వరద నీరు ఇళ్లల్లోకి చేరింది.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, ఊహించని ఈ విపత్తుతో చాలా మంది కన్నీరు పెడుతున్నారు, ఇళ్లల్లో సెల్లార్లలో నీరు ఇప్పటీకీ అలా నిలిచే ఉంది, హైదరాబాద్ వాసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు.
వరద ప్రభావంలో ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకుంటాము అని తెలిపారు సీఎం కేసీఆర్.. తెలంగాణ సర్కార్ ఏ హామీ ఇచ్చిందో చూద్దాం..వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం నేటి నుంచి అందించనున్నారు మంగళవారం నుంచి ఈ సాయం అందచేస్తారు.
మున్సిపల్ శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.ఇక చాలా మంది ఇళ్లు కూలిపోయాయి, అలా ఇళ్లు కూలిపోయిన వారికి లక్ష రూపాయల నగదు సాయం అందిస్తారు, ఇక పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50,000ల చొప్పున పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.భాగ్యనగరంలో వందేళ్ల కిందట మూసీకి వరదలు వచ్చిన సమయంలో 43 సెం.మీ. వర్షం కురిసింది.. ఈ ఏడాది ఇప్పటికే 120 సెం.మీ. వర్షపాతం నమోదైంది.