ఈ ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ – భారీగా పెరుగుతున్న కేసులు

-

కరోనా ప్రభావం మన దేశంలో వేసవి కాలం వర్షాకాలం చూశాం, అయితే దీని తీవ్రత శీతాకాలం మరింత ఎక్కువ ఉంటుంది అంటున్నారు నిపుణులు, అంతేకాదు మిగిలిన దేశాల్లో కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అంటున్నారు, అతి తీవ్రత ఆయా దేశాల్లో చూపిస్తోంది..

- Advertisement -

ఈ వైరస్ ఇప్పటికే 4 కోట్ల మందికి అంటుకుంది, ఇక ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 11 లక్షలు దాటింది. పది నెలల కాలంలోనే ఒక వైరస్ 200 పైగా దేశాల్లో నాలుగు కోట్ల మందికి సోకడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇక అమెరికాలో అత్యధిక కేసులు ఉంటే,, తర్వాత మన భారత్ ఉంది, ఆ తర్వాత బ్రెజిల్ రష్యా, స్పెయిన్ దేశాలు కొనసాగుతున్నాయి.

యూరప్ దేశాల్లో మళ్లీ వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తోంది ముందు తగ్గిన వైరస్ అక్కడ మళ్లీ చలికాలంలో ఇప్పుడు విజృంభిస్తోంది…యూకే, రష్యా, నెదర్లాండ్స్, స్పెయిన్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, ఫ్రాన్స్, బెల్జియం, దేశాల్లో కొత్తగా భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలా దేశాలు మళ్లీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. లండన్, పారిస్ మహా నగరాల్లో కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి. ఇప్పుడు కేసుల సంఖ్య మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...