నిజంగా విషాదకరమైన ఘటన ఇది రాజస్ధాన్ లోని జంపీ ప్రాంతంలో మయూరీ బాజ్ అనే అబ్బాయి – స్వప్నా దత్ అనే అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు, మయూరి బజ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో స్వప్న ఇంటిలో వారి పెద్దలు వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడారు, ఇద్దరికి ఇష్టం కావడంతో కట్నాలు లేకుండా పెళ్లికి మాట్లాడుకున్నారు.
ఈ సమయంలో వివాహం మొన్న రాత్రి జరిగింది, గ్రాండ్ గా వివాహం జరిగిన తర్వాత ఆమె నుంచి అతను తన రూమ్ కు వెళ్లి సెల్ ఫోన్ చార్జ్ పెట్టిన వైర్ ని తీశాడు, ఆ పక్కన ఉన్న పవర్ సప్లై వైర్ లింక్ అతని కాలికి తగిలింది.
దీంతో అతను షాక్ లో అక్కడే కుప్పకూలిపోయాడు, వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయానికి అతను ప్రాణాలు కోల్పోయాడు, దీంతో వివాహానికి వచ్చిన వారు బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు, అతని స్నేహితులు చివరి వరకూ అతని వెంట ఉండి కన్నీరు మున్నీరు అయ్యారు, ఆమెని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.