రూ.10 బిర్యానీ హోటల్ యజమాని అరెస్ట్ ఏం చేశాడంటే

-

ఈ కరోనా సమయంలో వ్యాపారాలు చాలా మందికి దెబ్బ తిన్నాయి, ఈ ఆరు నెలల కాలంలో కొత్త వ్యాపారాలు పెడదాము అని ఆగిపోయిన వారు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఈ సమయంలో కొత్తగా వ్యాపారాలు పెట్టి షాపుకి కస్టమర్లు వచ్చేలా ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు, పలు ఫుడ్ కోర్టులు బిర్యానీ పాయింట్లు కూడా చాలా వెలిశాయి.

- Advertisement -

ఆదివారం రోజున తమిళనాడులోని అరుప్పుకొట్టై లో ఓ హోటల్ ను ప్రారంభించారు ఇక్కడ. ఆ హోటల్ ప్రచారం కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రూ.10 బిర్యానీ అని ప్రకటించారు.
ఇక వందలాది మంది బిర్యానీ కోసం క్యూ కట్టారు దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది.

ఇక చాలా మంది మాస్క్ పెట్టుకోలేదు, ఇక సోషల్ డిస్టెన్స్ పాటించలేదు, దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు హోటల్ ఓనర్ పై కేసు పెట్టారు.. హోటల్ లో అప్పటికే సగానికి పైగా బిర్యానీ ప్యాకెట్లు అమ్మినట్లు పోలీసులు చెప్తున్నారు. యజమానిని అరెస్ట్ చేసిన తరువాత మిగిలిన బిర్యానీ ప్యాకెట్లను యాచకులు పంచారు. ఇక ఇలాంటి ఆఫర్లు ఇస్తే పలు జాగ్రత్తలు కూడా పాటించాలి, ఏ జాగ్రత్తలు లేకుండా ఉండటం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | ఢిల్లీ ఎన్నికలపై మోడీ ఫోకస్.. రేపు ఢిల్లీలో పర్యటన

ఢిల్లీ ఎన్నికలపై ప్రధాని మోడీ(PM Modi) దృష్టి సారించారు. అందులో భాగంగా...

Rythu Bharosa | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… రైతు భరోసా ఎప్పుడంటే..

తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 14 నుంచి...