కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.. శీతాకాలం దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు, అతి జాగ్రత్తలు తీసుకోకపోతే పెను ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు, అయితే కరోనా సోకి తర్వాత తగ్గిన వారిలో రెండు మూడునెలల తర్వాత పలు సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు వైద్యులు. ఆర్పీ ఎమ్మె సర్వేలో తేలింది.
దీని ప్రభావం తగ్గిన తర్వాత శరీరంలోని వివిధ అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ..వైరస్ తగ్గిన నాలుగు నెలల తర్వాత కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది.మరి ఏ సమస్యలు వస్తున్నాయి అనేది చూద్దాం.
నిస్సత్తువ
కండరాల నొప్పులు
తలనొప్పి
శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు
గుండెకి సంబంధించిన సమస్యలు
జీర్ణవ్యవస్థ సరిగా పని చేయకపోవడం కొందరికి కనిపిస్తోంది
ఊపిరితిత్తుల సమస్యలు
కిడ్నీలు
కాలేయం
వీటి సమస్యలతో కొందరు ఆస్పత్రులకి చేరుకుంటున్నారు, అందుకే జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియచేస్తున్నారు వైద్యులు.