అర్జున్ రెడ్డి తెలుగులో ఈ సినిమా ఎంతో క్రేజ్ తీసుకువచ్చింది, అంతేకాదు ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ, సినిమా దర్శకుడు సందీప్ వంగాకి మంచి పేరు వచ్చింది, పలువురు హీరోలు సినిమాలు చేయడానికి సిద్దం అయ్యారు ఈ దర్శకుడితో, అయితే తర్వాత ఇదే సినిమాని సందీప్ హిందీలో కబీర్ సింగ్ టైటిల్ తో రీమేక్ చేసారు. దీంతో సందీప్ రెడ్డికి బాగా డిమాండ్ పెరిగింది.
టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది ఆయనతో సినిమా చేస్తాము అన్నారు… అయితే స్టోరీ డిస్కషన్స్ జరిగాయి కాని కబీర్ సింగ్ తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా సందీప్ ఒకే చేయలేదు.. ప్రాజెక్ట్ సెట్ కాలేదు. దీంతో చాలా గ్యాప్ వచ్చింది, ఈ సమయంలో దర్శకుడు సందీప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తన తర్వాత సినిమాలన్నింటినీ తానే స్వయంగా నిర్మించుకోవాలని అనుకుంటున్నానని, వేరొకరు తన సినిమాకు డబ్బు పెడితే తనకు క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండదన్నారు. సో ఇక ఈ దర్శకుడే నిర్మాత అవ్వనున్నారు,మరి నెక్ట్స్ చిత్రం ఏమిటి హీరో ఎవరు అనేది చూడాలి.