బ్రేకింగ్ – అమెజాన్ ఉద్యోగులకి గుడ్ న్యూస్ చెప్పిన కంపెనీ

-

ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి తీవ్రత తగ్గాలి అంటే కచ్చితంగా టీకా రావాల్సిందే, అయితే తాజాగా ఈ కరోనా నేపథ్యంలో ఆరునెలలుగా అందరూ ఇంటిపట్టున ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు, ఇప్పటికే పలు కంపెనీలు వచ్చే ఏడాది మార్చి వరకూ అవకాశం కల్పించాయి, చాలా సంస్ధలు ఇంటి నుంచి అవకాశం ఉంటే అక్కడే చేయమని చెబుతున్నాయి.

- Advertisement -

వరల్డ్ లో ఫేమస్ టెక్ కంపెనీలు ఉద్యోగులకి ఈ అవకాశం ఇచ్చాయి, ఈ సమయంలో ఆన్లైన్ వాణిజ్య దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు కొంత వెసులుబాలు కల్పించింది. కార్పొరేట్ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోంను పొడిగించింది. అమెరికా వ్యాప్తంగా కొవిడ్-19 కేసులు మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్నయం తీసుకుంది.

వర్క్ఫ్రం హోంకు అవకాశం ఉన్నవారు జూన్ 30, 2021 వరకు దీనిని వినియోగించుకోవాలని అమెజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలోని ఈ సంస్థ ఉద్యోగుల్లో 19,000 మందికి కొవిడ్ సోకడంతో కీలక నిర్ణయం తీసుకుంది, మిగిలిన కంపెనీల బాటలోనే ఈ నిర్ణయం తీసుకుంది అమెజాన్. అందరి కంటే ముందు ట్విటర్ ఉద్యోగులకి ఈ అవకాశం ఇచ్చింది.మైక్రోసాఫ్ట్ కూడా తన ఉద్యోగులకి ఈ అవకాశం ఇచ్చింది..గూగుల్ యాపిల్, కోకోకోలా, స్క్వేర్ కూడా ఇదే తరహా విధానం అమలు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...