దేశంలో ఈ కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి, అవి కూడా చాలా వరకూ ఎక్స ప్రెస్ రైళ్లు మాత్రమే, ఇక ప్యాసింజర్ రైళ్లు ఎక్కడా నడవడం లేదు, ఆన్ లైన్ టికెట్ లేదా రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నారు, ఈ సమయంలో దేశవ్యాప్తంగా పాసెంజర్ రైళ్ల విషయంలో భారతీయ రైల్వేబోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
కొన్ని ప్రత్యేక పాసెంజర్ ట్రైన్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా అప్గ్రేడ్ చేస్తోంది. ఏపీ పరిధిలో మొత్తం 20 రైళ్లు ఇలా ఎక్స్ప్రెస్ రైళ్లుగా అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇక నిన్నటి వరకూ ప్రయాణికులకి ఇవి ప్యాసింజర్ రైళ్లుగా సేవలు అందించాయి, ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రైళ్లు అవుతున్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో విజయవాడ, గుంటూరు డివిజన్లలో నడుస్తున్న దాదాపు 20 పాసింజర్ రైళ్ల ను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్చింది ఇండియన్ రైల్వే.
అయితే దేశంలో ఉన్న రైల్వే జోన్లు అన్నీ పరిధిలో ఈ రైళ్ల మార్పు జరుగుతోంది, దీనికి ప్రధాన కారణం పాసెంజర్ రైళ్లు గమ్యాన్ని చేరడంలో ఆలస్యమవుతుండటం..వ్యయభారాన్నిఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు, దీని వల్ల వేగవంతమైన ప్రయాణం ఉంటుంది, ప్రయాణాలకు ఇష్టం చూపిస్తారు.. ప్రస్తుతం పాసెంజర్లు ఆగుతున్న హాల్టుల్లో ఇకపై ఇవి ఆగవు.
కొత్తగా ఎక్స్ప్రెస్లుగా మారాక ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ కోచ్లతో పాటు రిజర్వేషన్ సౌకర్యం వర్తించనుంది. అయితే ఎప్పటి నుంచి అనే సమయం తేదీ చెప్పలేదు.