భారతీయ రైల్వే నిత్యం రైల్వే ప్రయాణికులకి అనేక కొత్త సేవలు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పటికే పలు సర్వీసులు స్టార్ట్ చేసింది, ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి రైల్వే ప్రయాణం అందించాలి అని ఎప్పుడూ కోరుకుంటుంది రైల్వేశాఖ, అయితే తాజాగా మరో కొత్త సర్వీస్ స్టార్ట్ చేసింది.
ఇక నుంచి బ్యాగేజీని ప్రయాణికులు వెంట మోసుకెళ్లకుండా ఆ పనిని రైల్వేనే చేయనుంది. తక్కువ ఫీజుతోనే ఈ సేవలను అందించనున్నట్టు తెలిపింది రైల్వే శాఖ, ముందుగా ఈ సర్వీసుని కొన్ని స్టేషన్లలో అమలు పరుస్తారు…ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమైంది.
ఈ సేవలు పొందాలి అంటే బ్యాగ్స్ ఆన్ వీల్స్ అనే మొబైల్ అప్లికేషన్ను ద్వారా పొందాలి, త్వరలో ఈ యాప్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ల లో అందుబాటులో ఉండనుంది. తమ సామాన్లను రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు ప్రయాణికులు తీసుకువెళ్లేందుకు వాడుకోవచ్చు, ప్రయాణికుల బ్యాగేజీలను భద్రంగా చేరుస్తారు సిబ్బంది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, మహిళలకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీని వల్ల రైల్వే ఆదాయం పెరుగుతుంది, సర్వీస్ వల్ల ప్రజలకు తక్కువ ధరకే ఇంటికి సామాన్లు వస్తాయి.