టీజర్ పై విమర్శలు – రాజమౌళి తారక్ ని అలా ఎందుకు చూపించారు కారణం అదేనా

-

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సంబందించిన ఇంట్రో వీడియో టీజర్ వచ్చేసింది.. రికార్డులు క్రియేట్ చేస్తోంది, అయితే తాజాగా ఈ టీజర్ పై కొన్ని ప్రశంసలు వస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు, దీనికి ప్రధాన కారణం కూడా వారు చెబుతున్నారు.

- Advertisement -

ఈ టీజర్ లో ఎన్టీఆర్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేసిన రాజమౌళి.. చివర్లలో తారక్ ని ముస్లిం యువకుడిగా చూపించడంపై ఓ వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అసలు ఎలా ఇలా చూపిస్తారు అని నేరుగా రాజమౌళిని టార్గెట్ చేసి ప్రశ్నిస్తున్నారు..
విప్లవవీరుడు కొమరం భీమ్ నిజాం పాలనకి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడాడు అనేది చరిత్ర, మరి అలాంటి చరిత్ర వీరుడు గురించి చెబుతూ. చరిత్రను వక్రీకరించి భీమ్ ని ముస్లిం గెటప్ లో చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇదివరకు రాజమౌళి తెలియచేశారు ఈ చిత్రం ఫిక్షనల్ స్టోరీ అని.. చరిత్ర ప్రకారం ఎప్పుడూ కలవని స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ లు కలిసి పోరాడితే ఎలా ఉంటుందనే ఐడియా ఈ చిత్రం వచ్చింది,
అయితే ఈ సినిమాలో ఇప్పుడు చూపించింది సినిమాలో ఏదో గెటప్ లో కొమరం భీమ్ ముస్లింగా మారువేషంలో వెళ్లి ఉండవచ్చు కదా అని కొందరు అంటున్నారు.. చిత్రం విడుదల అయ్యేవరకూ వెయిట్ చేయాల్సిందే అంటున్నారు రాజమౌళి అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...