కాలేయం మనశరీరంలో చాలా ముఖ్యమైంది కాని కొందరు అతిగా మద్యం తాగడం వల్ల వారి కాలేయం నాశనం అవుతుంది,అది చెడిపోయి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు, దీనిపై నిర్లక్ష్యం వద్దు,
లోలోపల కాలేయానికి నెమ్మదిగా నష్టం జరుగుతూ తీవ్రంగా జబ్బుపడుతుంది. మరి కాలేయం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది లక్షణాలు ఏమిటో చూద్దాం.
అసలు ఆకలి వేయదు
అన్నం తినాలి అనిపించదు
నీరు తాగాలి అనిపించదు
నీరసం అసలు ఏమీ చేయలేని స్దితి
కామెర్లు
బరువు కోల్పోవడం
వీడని జ్వరం
రాత్రి వణుకు
పొట్ట, కాళ్ల వాపులు,
బాగా ఎక్కువగా రక్తపు వాంతులు
రక్తపు విరేచనాలు
ఇవి లక్షణాలు కనిపిస్తాయి, వీటిని మనం లైట్ తీసుకుంటే ఇక డాక్టర్లు ఏమీ చేయలేరు
ఇక ఈ లక్షణాలు గుర్తిస్తే మీరు రెండు మూడు వారాల్లో పరీక్షలు చేయించుకుంటే జబ్బు నయం అవుతుంది అంటున్నారు వైద్యులు, ఈ మధ్య పురుషులే కాదు మహిళలు మద్యం తీసుకుంటున్నారు, దీంతో వారికి కూడా ఈ సమస్యలు బయటపడుతున్నాయి.